పేర్ని నాని తో పాటు 400 మందిపై కేసు నమోదు..
అమరావతి, 20 సెప్టెంబర్ (హి.స.)మాజీ మంత్రి పేర్ని నాని సహా పలువురిపై కేసు నమోదైంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Govt) మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేస్తుందని ఆరోపిస్తూ.. వైసీపీ నేతలు (YCP leaders) చలో మచిలీపట్నం మెడికల్ కాలేజీ (Medic
పేర్ని నాని తో పాటు 400 మందిపై కేసు నమోదు..


అమరావతి, 20 సెప్టెంబర్ (హి.స.)మాజీ మంత్రి పేర్ని నాని సహా పలువురిపై కేసు నమోదైంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Govt) మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేస్తుందని ఆరోపిస్తూ.. వైసీపీ నేతలు (YCP leaders) చలో మచిలీపట్నం మెడికల్ కాలేజీ (Medical Colleges) కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమానికి ఎటువంటి అనుమతి లేదని ముందస్తుగానే పోలీసులు వైసీపీ నేతలకు సూచించారు. అయినప్పటికీ పోలీసులు సూచనలను లెక్క చేయని మాజీ మంత్రి పేర్ని నాని (former minister Nani).. తన అనుచరులు, పార్టీ కార్యర్తలతో కలిసి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఆ ప్రాంతం మొత్తం ఉదృక్త వాతావరణ నెలకొంది. దీంతో పోలీసులు దీనిని సీరియస్ గా తీసుకుని అనుమతి లేకుండా చేపట్టిన నిరసనల నేపధ్యంలో పేర్ని నాని, పేర్ని కిట్టు, కైలే అనిల్, సింహాద్రి రమేశ్, దేవినేని అవినాష్‌తో పాటు మరో 400 మందిపై కేసు నమోదు (Cases registered against 400 people) చేశారు. ఈ పరిణామం వైసీపీ నేతలతో పాటు నిరసనలో పాల్గొన్న వారిని షాక్ కు గురి చేసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande