ఉల్లి రైతులకు భారీ గుడ్ న్యూస్. రూ. 50 వేలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం
అమరావతి, 20 సెప్టెంబర్ (హి.స.)ఉల్లి రైతుల(Onion farmers)కు రాష్ట్ర ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ తెలిపింది. హెక్టార్‌(Hectare)కు రూ.50 వేలు ఇవ్వాలని నిర్ణయించింది. కేంద్రం నుంచి రూ. 17,500, రాష్ట్రం తరపున రూ. 32 వేలు చెల్లిస్తామని వెల్లడించింది. కొద్ది
చిన్న ఉల్లిపాయలు


అమరావతి, 20 సెప్టెంబర్ (హి.స.)ఉల్లి రైతుల(Onion farmers)కు రాష్ట్ర ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ తెలిపింది. హెక్టార్‌(Hectare)కు రూ.50 వేలు ఇవ్వాలని నిర్ణయించింది. కేంద్రం నుంచి రూ. 17,500, రాష్ట్రం తరపున రూ. 32 వేలు చెల్లిస్తామని వెల్లడించింది. కొద్ది రోజులుగా ఉల్లికి గిట్టు బాట ధర లేక రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. కనీసం ట్రాన్స్‌పోర్టు ఖర్చులు కూడా రాక ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయారు. కొన్ని సమయాల్లో ఉల్లిపాయలను రోడ్డుపై కూడా పారబోశారు. ఉల్లి రైతుల సమస్యలను తెలుసుకున్న ప్రభుత్వం వారికి చేయూతనిచ్చింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande