న్యూఢిల్లీ,23సెప్టెంబర్ (హి.స.)కేంద్ర ప్రభుత్వం ఉజ్జ్వలా యోజనను మరింత విస్తరించాలన్న నేపథ్యంలో కొత్తగా 25 లక్షల మహిళలకు ఉచిత LPG కనెక్షన్లు అందించనుంది. మహిళా సాధికారతకు తోడ్పడే ఈ నిర్ణయం 2025-26 ఆర్థిక సంవత్సరంలో అమలు కానుంది. ప్రధాని నరేంద్ర మోడీ సోషల్ మీడియా ద్వారా.. నవరాత్రి పవిత్ర సందర్భంలో, ఉజ్జ్వల కుటుంబానికి చెందిన తల్లులు, అక్కచెల్లలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ పని వల్ల వారు ఈ పండుగ రోజు ఆనందాన్ని పొందడమే కాక, మహిళా సాధికారతపై మన సంకల్పాన్ని బలోపేతం చేస్తుందని తెలిపారు.
కేంద్ర పెట్రోలియం అండ్ ప్రాకృతిక వాయు మంత్రి హర్దీప్ సింగ్ పూరీ తెలిపిన ప్రకారం.. నవరాత్రి ప్రారంభం సందర్భంగా, ఉజ్జ్వలా యోజన ద్వారా 25 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడమే మహిళలకు ప్రధాని మోడీ దేవి దుర్గా సమానమైన గౌరవాన్ని ఇస్తున్నారని అంటూ పేర్కొన్నారు. ఈ కనెక్షన్లతో దేశంలోని ఉజ్జ్వల కుటుంబాల సంఖ్య 10.60 కోట్లకు చేరుతుందని ఆయన అన్నారు. ప్రభుత్వం ప్రతి కనెక్షన్‌పై రూ.2,050 ఖర్చు పెట్టనుందని.. దీని ద్వారా లబ్ధిదారులు ఉచిత LPG సిలిండర్, గ్యాస్ స్టప్, రెగ్యులేటర్ వంటి పరికరాలను కూడా పొందగలరని అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ