దిల్లీ: 24 సెప్టెంబర్ (హి.స.)జీఎస్టీ 2.O అమలుతో వివిధ రంగాలపై సానుకూల ప్రభావం కనిపిస్తోంది. పైగా జీఎస్టీ 2.O పై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్వయంగా ప్రచారం చేస్తున్నారు. నూతన జీఎస్టీ నిర్ణయాలు దేశంలోని బొగ్గు రంగంపై సానుకూలంగా కనిపిస్తున్నాయి. బొగ్గు ఉత్పత్తిదారులు, వినియోగదారులు ఇద్దరికీ లాభం చేకూరేలా తాజా జీఎస్టీ నిర్ణయాలు సమతుల్యంగా ఉన్నాయని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.
జీఎస్టీ సంస్కరణలు ఆత్మనిర్భర్ భారత్ దిశగా ముందుకు వెళ్లేందుకు ఉపయోగపడతాయని భావిస్తున్నారు.
జీఎస్టీ సంస్కరణల్లో కోల్ రంగంపై నిర్ణయాలు చూస్తే.. బొగ్గుపై జీఎస్టీ పరిహార సెస్ రద్దు, అలాగే ప్రతి టన్ను కోల్ పై రూ.400 ల పరిహార సెస్ ను తొలిగించింది జీఎస్టీ కౌన్సిల్. ఇంకా బొగ్గుపై గతంలో జీఎస్టీ 5% నుంచి 18%కి పెంపు ఉండగా.. జీఎస్టీ నిర్ణయాలతో వినియోగదారులకు లాభం కానుంది. కొత్త విధానంతో బొగ్గు ధరల్లో గణనీయమైన తగ్గింపు వచ్చింది. G6 నుంచి G17 గ్రేడ్‌ల వరకు టన్నుకి రూపాయలు 13.40 నుంచి 329.61 వరకు ధరలు తగ్గాయి. విద్యుత్ రంగానికి టన్నుకి సగటు రూ.260 తగ్గిపోగా, దీని వలన ప్రతి యూనిట్ విద్యుత్ ఉత్పత్తి ఖర్చు 17–18 పైసలు తగ్గనుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ