ముంబయి,24, సెప్టెంబర్(హి.స.) దేశీయ మార్కెట్లు బుధవారం నష్టాల్లో ప్రారంభమయ్యాయి (Stock Market Today). హెచ్-1బీ వీసా ఆందోళనల ప్రభావంతో సూచీల్లో ప్రతికూల సెంటిమెంట్ కొనసాగుతూనే ఉంది. ఉదయం 9.31 గంటల సమయంలో సెన్సెక్స్ 344 పాయింట్లు నష్టపోయి 81,757 ట్రేడవుతుండగా.. నిఫ్టీ 106 పాయింట్లు కోల్పోయి 25,063 వద్ద కదలాడుతోంది.
నిఫ్టీ సూచీలో ట్రెంట్, ఎస్‌బీఐ, ఎన్‌టీపీసీ, ఆసియన్ పెయింట్స్, మారుతీ సుజుకీ షేర్లు లాభాల్లో ఉన్నాయి. టాటా మోటార్స్, టెక్ మహీంద్రా, హీరో మోటోకార్ప్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ స్టాక్స్ నష్టాల్లో ఉన్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 7 పైసలు తగ్గి, 88.80 వద్ద జీవనకాల కనిష్ఠాన్ని నమోదు చేసింది. ఇది తాత్కాలికంగా తమకు మేలు చేస్తుందని ఎగుమతిదారులు పేర్కొంటున్నా, దేశ ఆర్థికవ్యవస్థకు మాత్రం ఆందోళనకరమే. నిన్న అమెరికా మార్కెట్లు నష్టాల్లో ముగియగా.. తాజాగా ఆసియా మార్కెట్లు మిశ్రమంగా కదలాడుతున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ