భారత్‌ మావైపే.. ట్రంప్‌ ఆరోపణల వేళ జెలెన్‌స్కీ కీలక వ్యాఖ్యలు
దిల్లీ: 24 సెప్టెంబర్ (హి.స.) రష్యా నుంచి ఇంధనం కొనుగోలు చేస్తూ యుద్ధానికి భారత్‌ వనరులు అందిస్తోందంటూ ట్రంప్‌ (US President Donald Trump) మరోసారి విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ (Zelensky) కీలక వ్యాఖ్యలు చేశారు. ఫా
Zelensky


దిల్లీ: 24 సెప్టెంబర్ (హి.స.) రష్యా నుంచి ఇంధనం కొనుగోలు చేస్తూ యుద్ధానికి భారత్‌ వనరులు అందిస్తోందంటూ ట్రంప్‌ (US President Donald Trump) మరోసారి విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ (Zelensky) కీలక వ్యాఖ్యలు చేశారు. ఫాక్స్‌ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్‌ వ్యాఖ్యలపై స్పందించిన జెలెన్‌స్కీ భారత్‌ తమవైపే ఉందంటూ వ్యాఖ్యానించారు. రష్యాతో భారత్‌ చేసుకొన్న ఇంధన ఒప్పందం తమకు సమస్యగా మారినప్పటికీ దీనిని ట్రంప్‌ పరిష్కరించగలరని భావిస్తున్నట్లు తెలిపారు. రష్యా నుంచి ఇంధనాన్ని దిగుమతి చేసుకొనే విషయంలో మోదీ ప్రభుత్వం తన విధానాన్ని మార్చుకుంటుందని ఆశాభావం వ్యక్తంచేశారు.

అయితే భారత్‌లా చైనా తమకు మద్దతిస్తుందని చెప్పలేమని జెలెస్‌స్కీ (Zelensky) అన్నారు. ఎందుకంటే రష్యాతో జరుగుతున్న యుద్ధం ముగియడం వల్ల తమకు ఎలాంటి ప్రయోజనం లేదని చైనా భావించడమే కారణమన్నారు. అయినప్పటికీ ట్రంప్‌ యుద్ధం విషయంలో జిన్‌పింగ్ వైఖరిని మార్చగలరని భావిస్తున్నట్లు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande