పాట్నాలో నేడు సీడబ్ల్యూసీ మీటింగ్.
దిల్లీ: 24 సెప్టెంబర్ (హి.స.)బీహార్ ఎన్నికల నేపథ్యంలో పాట్నాలో తొలిసారి కాంగ్రెస్ కీలక సమావేశం నిర్వహిస్తోంది. ఈ సమావేశంలో ప్రధానంగా ఎన్నికల వ్యూహం, ఓట్ల చోరీ, ట్రంప్ సుంకాలు, వివిధ అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. అక్టోబర్ లేదా నవంబర్‌లోనే బీహార
Soniya Gandhi & Rahul Gandhi


దిల్లీ: 24 సెప్టెంబర్ (హి.స.)బీహార్ ఎన్నికల నేపథ్యంలో పాట్నాలో తొలిసారి కాంగ్రెస్ కీలక సమావేశం నిర్వహిస్తోంది. ఈ సమావేశంలో ప్రధానంగా ఎన్నికల వ్యూహం, ఓట్ల చోరీ, ట్రంప్ సుంకాలు, వివిధ అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. అక్టోబర్ లేదా నవంబర్‌లోనే బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం జరిగే సీడబ్ల్యూసీ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.

స్వాతంత్య్రానంతర కాలంలో బీహార్‌లో కాంగ్రెస్ సీడబ్ల్యూసీ సమావేశం నిర్వహించడం ఇదే మొదటిసారి అని ఆ పార్టీ నాయకులు తెలిపారు. పాట్నాలోని సదాకత్ ఆశ్రమంలో బుధవారం ఉదయం 10 గంటలకు సీడబ్ల్యూసీ సమావేశం జరగనుంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ప్రధాన కార్యదర్శులు దీపా దాస్ మున్షీ, సయీద్ నాసిర్ హుస్సేన్ సహా అగ్ర కాంగ్రెస్ నాయకుంతా ఈ సమావేశానికి హాజరవుతారు. లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు జైరాం రమేష్, కేసీ వేణుగోపాల్ కూడా ఈ సమావేశానికి హాజరుకానున్నారు

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande