'ఓట్ చోరీ'పై ప్రజల్లో చైతన్యం తేవాలి.. AICC ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్
హైదరాబాద్, 23 సెప్టెంబర్ (హి.స.) ''ఓట్ చోరీ'' అంశంపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ అన్నారు. ఇవాళ రాష్ట్ర టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ కుమార్ గౌడ్ నిర్వహించిన జూమ్ మీటింగ్లో ఆమె పాల్గొన్
ఎఐసిసి ఇంచార్జ్


హైదరాబాద్, 23 సెప్టెంబర్ (హి.స.) 'ఓట్ చోరీ' అంశంపై ప్రజల్లో చైతన్యం

తీసుకురావాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ అన్నారు. ఇవాళ రాష్ట్ర టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ కుమార్ గౌడ్ నిర్వహించిన జూమ్ మీటింగ్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో స్థానిక సంస్థలు సమీపిస్తున్న వేళ 'ఓట్ చోరీ'పై చేపడుతోన్న సంతకాల సేకరణ ప్రతి ఒక్కరూ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని అన్నారు. అక్టోబర్ 15 నాటికి ప్రతి గ్రామంలో సంతకాల సేకరణ పూర్తి కావాలన్నారు. లక్షలాదిగా సంతకాల సేకరణ చేసి కాపీలను ఏఐసీసీ కి పంపాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

రాహుల్ గాంధీ తో పాటు ఏఐసీసీ చేస్తున్న 'ఓట్ చోరీ' ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీ సైనికులు అంతా దన్నుగా నిలబడాలని పిలుపునిచ్చారు. కాగా, పార్టీ డిజిటల్ మెంబర్షిప్లో తెలంగాణ రాష్ట్రం నెంబర్వన్గా నిలవడం సంతోషంగా ఉందన్నారు. నరేంద్ర మోడీ, అమిత షా ద్వయం ఎన్నికల కమిషన్ను అడ్డం పెట్టుకుని 'ఓట్ చోరీ'కి పాల్పడి వరుసగా మూడో సారి అధికారంలోకి వచ్చారని ఆరోపించారు. 'ఓట్ చోరీ'పై ప్రజల్లో పూర్తి అవగాహన, చైతన్యం తీసుకొచ్చే బాధ్యతను అందుతూ తమ భుజాలపైకి ఎత్తుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలతో పాటు డీసీసీ అధ్యక్షులు, పలువురు ఎమ్మెల్యేలు, ఆఫీసు బేరర్లు పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande