శ్రీశైలం.నుంచి 10,.గేట్ల ద్వారా సాగర్ కు.నీటి విడుదల
అమరావతి, 24 సెప్టెంబర్ (హి.స.) శ్రీశైలం:శ్రీశైలం రిజర్వాయర్‌( కు ఎగువ జూరాల స్పిల్‌వే, సుంకేసుల, హంద్రీ నుంచి డ్యాంకు 3.58లక్షల క్యూసెక్కులు ఇన్‌ఫ్లోగా వచ్చి చేరాయి. శ్రీశైలం పది గేట్ల ద్వారా సాగర్‌కు నీటిని విడుదల చేస్తున్నారు. వరద వేగం పుంజుకోవడంత
శ్రీశైలం.నుంచి 10,.గేట్ల ద్వారా సాగర్ కు.నీటి విడుదల


అమరావతి, 24 సెప్టెంబర్ (హి.స.)

శ్రీశైలం:శ్రీశైలం రిజర్వాయర్‌( కు ఎగువ జూరాల స్పిల్‌వే, సుంకేసుల, హంద్రీ నుంచి డ్యాంకు 3.58లక్షల క్యూసెక్కులు ఇన్‌ఫ్లోగా వచ్చి చేరాయి. శ్రీశైలం పది గేట్ల ద్వారా సాగర్‌కు నీటిని విడుదల చేస్తున్నారు. వరద వేగం పుంజుకోవడంతో గేట్ల ఎత్తును 14 అడుగులకు ఇంజనీర్లు పెంచారు. రెండు విద్యుత్‌ కేంద్రాల్లో విద్యు దుత్పత్తి అనంతరం 65,482 క్యూసెక్కులు విడుదల చేశారు. గడిచిన ఇరవై నాలుగు గంటల్లో 31.869 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసి గ్రిడ్‌కు జెన్‌కో అధికారులు అనుసంధానం చేశారు. మంగళవారం సాయంత్రం నీటినిల్వ సామర్థ్యం 203 టీఎంసీలుగా ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande