హైదరాబాద్, 24 సెప్టెంబర్ (హి.స.)
రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అధికారులపై చర్యలకు విజిలెన్స్ సిఫార్సు చేసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, అప్పట్లో హెచ్ఎండీఏ కమిషనర్గా కొనసాగిన అరవింద్ కుమార్, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డిలపై చర్యలకు విజిలెన్స్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో అరవింద్ రెడ్డి, బీఎల్ఎన్ రెడ్డిలు కీలకంగా ఉన్నారు. ఈ-ఫార్ములా కార్ రేస్ కేసులో క్విడ్ ప్రో కో జరిగిందని తేల్చిన ఏసీబీ ఈ కేసులో ప్రాసిక్యూషన్ కు అనుమతి ఇవ్వాలని ఇటీవల ప్రభుత్వానికి నివేదిక పంపించింది. ఈ నివేదికను ప్రభుత్వం విజిలెన్స్ కమిషన్ పరిశీలనకు పంపించింది. ఈ నివేదికను పరిశీలించిన విజిలెన్స్ కమిషన్ అధికారులపై చర్యలకు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అధికారులపై చర్యలకు సిఫార్సు చేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు