అమరావతి, 24 సెప్టెంబర్ (హి.స.)
విజయవాడ: ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ) విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వేదమంత్రోచ్చారణలతో ఘన స్వాగతం పలికారు. మంత్రి కొలుసు పార్థసారథి, పాలకమండలి ఛైర్మన్ రాధాకృష్ణ తదితరులు.. ఉప రాష్ట్రపతి దంపతులకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం దుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
దర్శనం అనంతరం ఉప రాష్ట్రపతి మాట్లాడారు. విజయవాడ రావడం, అమ్మవారిని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ప్రజలందరిపై అమ్మవారి ఆశీస్సులు ఉండాలని.. ఆంధ్ర ప్రదేశ్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని పేర్కొన్నారు. ప్రజలంతా సంతోషంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు చెప్పారు. ఇవాళ సాయంత్రం పున్నమి ఘాట్ వద్ద నిర్వహించే విజయవాడ ఉత్సవ్‌లో ఉపరాష్ట్రపతి పాల్గొననున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ