ఆంధ్రప్రదేశ్ లోని 100.పుణ్యక్షేత్రాల్లో టెంట్ సిటీల ఏర్పాటున
అమరావతి, 24 సెప్టెంబర్ (హి.స.) అమరావతి: రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నట్టు పర్యాటకశాఖ మంత్రి కందుల దర్గేష్‌ ) తెలిపారు. రాష్ట్రంలో కారవాన్‌ టూరిజంను అభివృద్ధి చేసేందుకు, పురాత
ఆంధ్రప్రదేశ్ లోని 100.పుణ్యక్షేత్రాల్లో టెంట్ సిటీల ఏర్పాటున


అమరావతి, 24 సెప్టెంబర్ (హి.స.)

అమరావతి: రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నట్టు పర్యాటకశాఖ మంత్రి కందుల దర్గేష్‌ ) తెలిపారు. రాష్ట్రంలో కారవాన్‌ టూరిజంను అభివృద్ధి చేసేందుకు, పురాతన కట్టడాల వద్ద పర్యాటకుల విడిది కోసం హోం స్టే పాలసీలను త్వరలో తీసుకొస్తామని తెలిపారు. 100 పుణ్యక్షేత్రాల్లో టెంట్‌ సిటీలు ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని చేపట్టినట్టు వివరించారు.

పర్యాటకశాఖ పరిధిలోని ప్రాజెక్టులపై శాసనమండలిలో ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నలకు మంత్రి దుర్గేశ్‌ సమాధానం ఇచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చాక పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా ఇచ్చి అభివృద్ది చేస్తున్నామన్నారు. వైకాపా హయాంలో కేంద్రం నుంచి రూ.54 కోట్లతో కేవలం ఒక పాజెక్టు మాత్రమే తెచ్చారన్న మంత్రి.. కూటమి ప్రభుత్వం వచ్చాక కేంద్రం నుంచి రూ.441 కోట్ల విలువైన 8 ప్రాజెక్టులు తెచ్చామన్నారు. 15 నెలల్లో రూ.10,644 కోట్ల పెట్టుబుడుల కోసం 103 సంస్థలతో ఎంవోయూలు చేసుకున్నామన్నారు. కేంద్రం నుంచి రూ.441 కోట్ల నిధులతో అఖండ గోదావరిపై హ్యావలాక్ బ్రిడ్జ్ వద్ద అభివృద్ది కార్యక్రమాలు చేపడుతున్నామన్న మంత్రి.. పర్యాటకం కోసం హోటళ్లలో ఐదేళ్లలో 50 వేల రూమ్‌లను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. 2019-24 మధ్యలో టూరిజం ప్రాజెక్టుల్లో జరిగిన అవకతవకలపై విచారణ జరుగుతోందని.. కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande