మెదక్. 24 సెప్టెంబర్ (హి.స.)
ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలని
భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు మెదక్ ఎంపీ రఘునందన్ రావు తెలిపారు. రామాయంపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మనిషి వ్యక్తిగతంగా పరిశుభ్రంగా ఉన్నట్లయితే ఆరోగ్యంగా ఉంటారన్నారు. ప్రజల వద్దకి వైద్యులను తీసుకువచ్చి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు సరఫరా చేస్తున్నట్లు పేర్కొన్నారు. త్వరలోనే కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి ఉచితంగా అద్దాలు పంపిణీ చేస్తామని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు