గౌహతి, 23 సెప్టెంబర్ (హి.స.)
ప్రముఖ అస్సామీ గాయకుడు జుబీన్ గార్గ్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. గౌహతిలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియలు జరుగుతుంటుండగా భార్య గరిమా సైకియా గార్గ్ ఏడుస్తూనే కనిపించారు.
జుబీన్ గార్గ్ అంత్యక్రియలకు కేంద్ర మంత్రులు సర్బానంద సోనోవాల్, కిరన్ రిజిజు, పబిత్రా మార్గరీటా, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ, అసెంబ్లీ స్పీకర్ బిశ్వజిత్ డైమరీ, పలువురు కేబినెట్ మంత్రులు, సీనియర్ ప్రభుత్వ అధికారులు హాజరై శవపేటికపై పూల మాలలు వేసి నివాళులర్పించారు. సోనోవాల్, మార్గరీటా, హిమంత బిస్వా శర్మ, ప్రతిపక్ష నాయకుడు దేబబ్రత సైకియా మోకాళ్లపై నిలబడి నివాళులర్పించారు.
జుబీన్ గార్గ్ గౌరవార్థం రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థలు మూసివేశారు. అలాగే ప్రభుత్వ కార్యాలయాలు కూడా మూసేశారు. ఇక కడసారి చూపు కోసం వేలాది మంది అభిమానులు, ప్రజలు అంత్యక్రియలకు తరలివచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..