నిరుద్యోగ యువతతో సమావేశమైన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు
హైదరాబాద్, 23 సెప్టెంబర్ (హి.స.)సిటీ సెంట్రల్ లైబ్రరీల్లో నిరుద్యోగ యువతతో సమావేశమైన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు గారు, వారి సమస్యలు విని చర్చించారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని
నిరుద్యోగ యువతతో సమావేశమైన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు


హైదరాబాద్, 23 సెప్టెంబర్ (హి.స.)సిటీ సెంట్రల్ లైబ్రరీల్లో నిరుద్యోగ యువతతో సమావేశమైన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు గారు, వారి సమస్యలు విని చర్చించారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడారు.

కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చింది. కానీ నోటిఫికేషన్లు ఇవ్వక వంచించింది. రెండేళ్లు పూర్తవుతున్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీకి ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం దురదృష్టకరం.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్నా రేవంత్ ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వక యువతను మోసం చేసింది.

ఉద్యోగాలు భ‌ర్తీ చేసి నిరుద్యోగుల‌కు న్యాయం చేసే వ‌ర‌కు వారి త‌ర‌ఫున బిజెపి పోరాటం కొనసాగిస్తుంది.

కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వలన గ్రూప్-1 పరీక్ష మళ్లీ నిర్వహించాల్సిన పరిస్థితి తలెత్తింది. యువత జీవితాలతో ఆటలాడటం సరికాదు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande