రాష్ట్ర వ్యాప్తంగా .శిథిలావస్థకు చేరిన. 352 వంతెనల నిర్మాణానికి 1,432 కోట్లు
అమరావతి, 23 సెప్టెంబర్ (హి.స.) రాష్ట్రవ్యాప్తంగా శిథిలావస్థకు చేరిన 352 వంతెనల స్థానంలో కొత్త వాటిని నిర్మించడానికి రూ.1,432 కోట్లు కావాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో శిథిల వంతెనలు, రహదారుల పరిస్థితిపై శాసనసభలో
రాష్ట్ర వ్యాప్తంగా .శిథిలావస్థకు చేరిన. 352 వంతెనల నిర్మాణానికి 1,432 కోట్లు


అమరావతి, 23 సెప్టెంబర్ (హి.స.) రాష్ట్రవ్యాప్తంగా శిథిలావస్థకు చేరిన 352 వంతెనల స్థానంలో కొత్త వాటిని నిర్మించడానికి రూ.1,432 కోట్లు కావాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో శిథిల వంతెనలు, రహదారుల పరిస్థితిపై శాసనసభలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి బీసీ జనార్దన్‌ రెడ్డి సమాధానం ఇచ్చారు. కొత్త వంతెనల నిర్మాణం కోసం కేంద్ర ఆర్థిక సంఘం నిధుల కోసం ప్రతిపాదించినట్లు తెలిపారు. రాష్ట్రంలో చాలా రహదారులు ఇటీవలి వర్షాలకు పాడైపోయాయని.. వర్షాకాలం తర్వాత వాటికి మరమ్మతులు చేస్తామని వివరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande