తెలంగాణ, సంగారెడ్డి. 23 సెప్టెంబర్ (హి.స.)
డ్యూటీలో ఉన్న వైద్యుల పై దాడి
చేయడం హేయమైన చర్య అని సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వైద్య బృందం సభ్యులు అన్నారు. సోమవారం మహబూబాబాద్ లో అక్కడి ప్రభుత్వ ఆసుపత్రి పర్యవేక్షకుడు ఇతర సిబ్బందిపై జరిగిన దాడిని ఖండిస్తూ మంగళవారం సంగారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్ ఎదుట స్థానిక వైద్యులు నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..
ఆసుపత్రికి వచ్చే రోగులకు రక్షణగా నిలిచే వైద్యుల పట్ల దాడికి దిగడం ఆవేదనకు గురి చేసిందన్నారు. ప్రభుత్వం స్పందించి డాక్టర్ల పై దాడికి దిగిన వారి పై కఠిన చర్యలు తీసుకొని, మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని వారు డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో డాక్టర్లు అనిల్ కుమార్, సుధావాణి, విక్రమ్ కుమార్, ఆనంద్, గోవింద్, రమేష్, అంబికా ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు