విజయవాడ23 సెప్టెంబర్ (హి.స.): తొలిరోజు విజయవాడ ఉత్సవ్ ఘనంగా జరిగిందని.. ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని అన్నారు. కూటమి నేతలు అందరూ కలిసి ఈ ఉత్సవాలను విజయవంతం చేయడానికి కృషి చేస్తున్నారని ప్రశంసించారు. విజయవాడ ఉత్సవ్‌కు ఇవాళ రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా హజరవుతారని తెలిపారు. బుధవారం ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ రానున్నారని.. ఆయన తొలి పర్యటన విజయవాడ ఉత్సవ్‌తో ప్రారంభం కానుందన్నారు. ఇక్కడి సాంస్కృతిక ఉత్సవాలను తిలకించిన అనంతరం ఆయన తిరుపతికి వెళ్తారని చెప్పారు. విజయవాడ ఉత్సవ్‌కు ప్రముఖులు వస్తున్నారని.. 28న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. 29న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు హాజరవుతారని చెప్పారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ