మరోసారి ఆగిపోయిన మెట్రో రైలు.. ఆందోళనకు గురైన ప్రయాణికులు
హైదరాబాద్, 23 సెప్టెంబర్ (హి.స.) హైదరాబాద్ మెట్రో రైలులో మరోసారి టెక్నికల్ సమస్య తలెత్తింది. దీంతో పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఈ పరిణామంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎల్బీనగర్-మియాపూర్ మెట్రో మార్గంలో భరత్ నగర్ స్టేషన్లో మెట్రో రై
మెట్రో ట్రైన్


హైదరాబాద్, 23 సెప్టెంబర్ (హి.స.)

హైదరాబాద్ మెట్రో రైలులో మరోసారి టెక్నికల్ సమస్య తలెత్తింది. దీంతో పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఈ పరిణామంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎల్బీనగర్-మియాపూర్ మెట్రో మార్గంలో భరత్ నగర్ స్టేషన్లో మెట్రో రైలు సమారు 8 నిమిషాల పాటు సాంకేతిక సమస్యతో నిలిచిపోయింది. విద్యుత్ ఫీడర్ ఛానల్లో తలెత్తిన సమస్యతో రైలు నిలిచినట్లుగా ప్రాథమికంగా తెలుస్తోంది. భరత్ నగర్ మెట్రో రైల్ సిబ్బంది సమాచారం మేరకు టెక్నికల్ టీమ్ స్పాట్ చేరుకుని టెక్నికల్ సమస్యను నిమిషాల్లోనే సరి చేశారు. సుమారు 25 నిమిషాల అనంతరం మెట్రో రైళ్ల రాకపోకలు యథావిధిగా కొనసాగున్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande