ఐవీఎఫ్ ల్యాబ్స్‌లో ఏఐని ప‌రిచ‌యం చేసిన నోవా
హైదరాబాద్, 23 సెప్టెంబర్ (హి.స.)అత్యుత్త‌మ పిండాల‌ను ఎంపిక చేసుకోవ‌డం, త‌ద్వారా గ‌ర్భ‌స్థ ఫ‌లితాల‌ను మెరుగుప‌రుచుకోవ‌డానికి హైద‌రాబాద్ బంజారాహిల్స్‌లోని నోవా ఐవీఎఫ్ ఫెర్టిలిటీ త‌మ ఐవీఎఫ్ ల్యాబ్‌లో ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ ప‌రిజ్ఞానాన్ని ప్ర‌వేశ‌పెట
ఐవీఎఫ్ ల్యాబ్స్‌లో ఏఐని ప‌రిచ‌యం చేసిన నోవా


హైదరాబాద్, 23 సెప్టెంబర్ (హి.స.)అత్యుత్త‌మ పిండాల‌ను ఎంపిక చేసుకోవ‌డం, త‌ద్వారా గ‌ర్భ‌స్థ ఫ‌లితాల‌ను మెరుగుప‌రుచుకోవ‌డానికి హైద‌రాబాద్ బంజారాహిల్స్‌లోని నోవా ఐవీఎఫ్ ఫెర్టిలిటీ త‌మ ఐవీఎఫ్ ల్యాబ్‌లో ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ ప‌రిజ్ఞానాన్ని ప్ర‌వేశ‌పెట్టింది. అంత‌ర్జాతీయ ప‌రిశోధ‌న‌ల ఫ‌లితాల ప్ర‌కారం, వీటా ఎంబ్రియో అనే ఈ టూల్ ఫ‌లితంగా గ‌ర్భ‌స్థ ఫ‌లితాలు 12% మెరుగుప‌డ్డాయ‌ని తేలింది. బంజారాహిల్స్, కూక‌ట్‌ప‌ల్లి ప్రాంతాల్లోని త‌మ కేంద్రాల్లో ఉన్న ఐవీఎఫ్ ల్యాబ్స్‌లో నోవా ఈ ఏఐని ప్ర‌వేశ‌పెట్టింది.

ఐవీఎఫ్ ల్యాబ్స్‌లో అత్యుత్త‌మ పిండాన్ని ఎంపిక చేయ‌డం అనేది ఎంబ్రియాల‌జిస్టులు చేస్తారు. ప్ర‌తి పిండాన్నీ డ‌బుల్ చెక్ చేసేందుకు ఏఐ ఉప‌యోగ‌ప‌డుతుంది. సాధార‌ణంగా మ‌నుషులు చూసిన‌ప్పుడు క‌నిపెట్ట‌లేని అనేక అంశాల‌ను అది గుర్తిస్తుంది. త‌ద్వారా క‌చ్చితత్వాన్ని పెంచి, ఐవీఎఫ్ సైకిల్ టైంలైన్ల‌ను త‌గ్గిస్తుంది.

ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్ బంజారాహిల్స్‌లోని నోవా ఐవీఎఫ్ ఫెర్టిలిటీ కేంద్రం క్లినిక‌ల్ డైరెక్ట‌ర్, ఫెర్టిలిటీ నిపుణురాలు డాక్ట‌ర్ హిమ‌దీప్తి మాట్లాడుతూ, “ప్ర‌స్తుతం మ‌న దేశంలో ప్ర‌తి నాలుగు జంట‌ల్లో ఒక‌రికి సంతాన‌రాహిత్య స‌మ‌స్య‌లు ఉంటున్నాయి. అందువ‌ల్ల ఫెర్టిలిటీ చికిత్స‌ల్లో మ‌రింత క‌చ్చిత‌త్వం అవ‌స‌రం. పిండం ఎంపిక కోసం మా ఐవీఎఫ్ ల్యాబ్స్‌లో ఏఐని స‌మ‌కూర్చుకున్నాం. మా ఎంబ్రియాల‌జిస్టులు ఒక పిండాన్ని విశ్లేషించిన త‌ర్వాత ఆ పిండం ఎదుగుద‌ల, నాణ్య‌త‌ ఎలా ఉంటాయ‌న్న విష‌యాన్ని తెలుసుకోవ‌డానికి వారు ఏఐ టూల్ ఉప‌యోగిస్తారు. ఇది మ‌రింత క‌చ్చితంగా అంచనా వేయ‌డం ద్వారా ల్యాబ్ శాస్త్రవేత్త‌లు (ఎంబ్రియాల‌జిస్టులు) పిండాన్ని ఎంచుకోగ‌ల‌రు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande