'కార్మికుల నోట్లో మట్టి కొట్టారు'.. కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలు
గోదావరిఖని, 23 సెప్టెంబర్ (హి.స.) సింగరేణి కార్మికులు రక్తాన్ని చెమటగా మార్చి ప్రభుత్వానికి లాభాలు ఇస్తే కార్మికుల నోట్లో మట్టి కొట్టారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ ప్రభుత్వం పై ఆరోపించారు. మంగళవారం గోదావరిఖనిలో ఆమె మాట్ల
MLC Kavita


గోదావరిఖని, 23 సెప్టెంబర్ (హి.స.)

సింగరేణి కార్మికులు రక్తాన్ని చెమటగా మార్చి ప్రభుత్వానికి లాభాలు ఇస్తే కార్మికుల నోట్లో మట్టి కొట్టారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ ప్రభుత్వం పై ఆరోపించారు. మంగళవారం గోదావరిఖనిలో ఆమె మాట్లాడారు. ప్రాణాలు పణంగా పెట్టి బొగ్గు ఉత్పత్తి చేసి లాభాలు తీసుకొస్తే కార్మికులను కాంగ్రెస్ ప్రభుత్వం నట్టేట ముంచిందన్నారు. వాళ్లకు న్యాయపరంగా వచ్చే లాభాలను ఇవ్వకుండా మోసపూరితంగా లాభాల బోనస్ ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు.

కొత్త బొగ్గు గని బాగులను కార్మికులకు అప్పచెప్పితే లాభాలు తీసి ప్రభుత్వానికి అందిస్తారన్నారు. సింగరేణి కోల్ బెల్ట్ ఏరియాలోని ఎమ్మెల్యేను, మంత్రులను పిలుచుకొని లాభాల బోనస్ ను ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. సింగరేణి సంస్థలో రాజకీయ జోక్యం అధికమైందన్నారు. తెలంగాణ జాగృతి, హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో శ్రీరాంపూర్ లో జరిగే బతుకమ్మ సంబరాలకు వెళుతుండగా గోదావరిఖనిలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande