తెలంగాణ, కోరుట్ల. 23 సెప్టెంబర్ (హి.స.)
ఆరోగ్యవంతమైన మహిళలతోనే
బలమైన కుటుంబంగా నిలుస్తుందని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అన్నారు. అయిలాపూర్ గ్రామంలో స్వస్థ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి మహిళా ఆరోగ్యంతో ఉండాలన్న ఉద్దేశ్యంతో మహిళలు ప్రధానంగా ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలకు వైద్యం అందించడంకోసం ఆరోగ్య మహిళ కార్యక్రమం ప్రవేశపెట్టబడిందన్నారు. కోరుట్ల నియోజకవర్గ ప్రజలు నాడు డయాలసిస్ కొరకు హైదరాబాద్ కు వెళ్ళేవారాని, నేడు కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రిలోనే చేయించుకుంటున్నారన్నారు. కెసిఆర్ హయాంలోనే కోరుట్ల ప్రభుత్వాసుపత్రి 100 పడకల ఆసుపత్రిగాను, డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు