విద్యార్థులకు మెరుగైన వైద్యం అందిస్తాం : మెదక్ జిల్లా కలెక్టర్
తెలంగాణ, మెదక్. 23 సెప్టెంబర్ (హి.స.) మదర్సాలో అస్వస్థతకు గురైన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందిస్తామని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. ఈ మేరకు మంగళవారం వారు రామాయంపేటలో అస్వస్థతకు గురైన విద్యార్థులను పరామర్శించారు. మదర్సాలో మరి కొంతమంది
మెదక్ కలెక్టర్


తెలంగాణ, మెదక్. 23 సెప్టెంబర్ (హి.స.)

మదర్సాలో అస్వస్థతకు గురైన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందిస్తామని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. ఈ మేరకు మంగళవారం వారు రామాయంపేటలో అస్వస్థతకు గురైన విద్యార్థులను పరామర్శించారు. మదర్సాలో మరి కొంతమంది విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. ఫుడ్ పాయిజన్ కావడానికి గల కారణాలను తెలుసుకుంటున్నామన్నారు. ఇప్పుడు విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. కలెక్టర్ వెంట డీసీహెచ్ శివ దయాళ్, డాక్టర్ లింబాద్రి, వైద్య సిబ్బంది ఉన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande