ఇవాల్టీ నుంచి మళ్లీ బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ ముందు వాదనలు.. ఢిల్లీకి వెళ్లిన మంత్రి ఉత్తమ్
హైదరాబాద్, 23 సెప్టెంబర్ (హి.స.) కృష్ణానదిలో తెలంగాణకు రావాల్సిన న్యాయమైన వాటా సాధిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. నికర జలాలైనా, మిగులు జలాలైనా, వరద జలాలైనా ఒక్క చుక్కను వదులుకోబోమన్నారు. ఇవాల్టి నుంచి కృష్ణా జలాల వివాద పరిష్కారం కోసం
మంత్రి ఉత్తం


హైదరాబాద్, 23 సెప్టెంబర్ (హి.స.)

కృష్ణానదిలో తెలంగాణకు రావాల్సిన న్యాయమైన వాటా సాధిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. నికర జలాలైనా, మిగులు జలాలైనా, వరద జలాలైనా ఒక్క చుక్కను వదులుకోబోమన్నారు. ఇవాల్టి నుంచి కృష్ణా జలాల వివాద పరిష్కారం కోసం ఏర్పాటైన బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ విచారణ తిరిగి ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలో ఈ విచారణలో వాదనలు వినిపించేందుకు అధికారులు, న్యాయవాదుల బృందంతో కలిసి ఢిల్లీ వెళ్లిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవాళ అక్కడ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రయోజనాలు కాపాడటానికి బలమైన వాదనలు వినిపిస్తామని, కృష్ణానదిపై ప్రాజెక్టుల వివరాలు ట్రైబ్యునల్ కు సమర్పిస్తామన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande