వరద ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం.. పటాన్చెరు ఎమ్మెల్యే
తెలంగాణ, సంగారెడ్డి. 23 సెప్టెంబర్ (హి.స.) తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని ముత్తంగి, ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని చిట్కుల్ గ్రామాల పరిధిలో నూతనంగా ఏర్పడిన కాలనీలలో వరదనీరు మూలంగా ఏర్పడుతున్న సమస్యకు శాశ్వత ముగింపు పలుకుతూ అతి త్వరలో రూ. ఆరు కోట్లతో
ఎమ్మెల్యే గూడెం


తెలంగాణ, సంగారెడ్డి. 23 సెప్టెంబర్ (హి.స.)

తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని ముత్తంగి, ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని చిట్కుల్ గ్రామాల పరిధిలో నూతనంగా ఏర్పడిన కాలనీలలో వరదనీరు మూలంగా ఏర్పడుతున్న సమస్యకు శాశ్వత ముగింపు పలుకుతూ అతి త్వరలో రూ. ఆరు కోట్లతో బాక్స్ డ్రైనేజీ నిర్మాణ పనులను ప్రారంభించబోతున్నట్లు పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. మంగళవారం వారు నియోజకవర్గంలోని పలు కాలనీలలో పర్యటించారు. వివిధ శాఖల అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. ప్రజలను కలిసి వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మాట్లాడుతూ ముత్తంగి, ఇస్నాపూర్ చెరువుల నుండి అలుగులు పారుతూ జాతీయ రహదారి మీదుగా ప్రవహిస్తున్న నీటిని కాలనీలలోకి వెళ్లకుండా నూతన బాక్స్ డ్రైనేజీ ద్వారా చిన్న వాగులోకి పంపిస్తారని తెలిపారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఏర్పాటు అవుతున్న నూతన కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande