తెలంగాణ, మెదక్. 23 సెప్టెంబర్ (హి.స.)
చిన్నశంకరంపేట మండలం.
అంబాజీపేట గ్రామంలో దుర్గమ్మ ఆలయం వద్ద గ్రామకంఠం భూమిని కొందరు రియల్టర్లు కబ్జా చేశారని ఆరోపిస్తూ, గ్రామస్తులు మంగళవారం చేగుంట-మెదక్ రోడ్డుపై రాస్తారోకో ధర్నా నిర్వహించారు. జెసిబితో ఆలయం ముందు పనులు ప్రారంభించగా, పెద్ద మొత్తంలో గ్రామస్తులు మహిళలు ఆలయం వద్దకు వెళ్లి ఆందోళన చేపట్టారు. పనులను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ, గ్రామస్తులు మహిళలు రోడ్డుపై రాస్తారోకో, ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. గ్రామంలో దుర్గమ్మ ఆలయం వద్ద గ్రామ భూమిని ఆక్రమించి పనులు చేపట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గుడి ఆవరణలో ఉన్న 25 గుంటల భూమిని రియల్టర్లు కబ్జా చేసి చుట్టూ ప్రహరీ నిర్మాణం చేపట్టడంపై అభ్యంతరం తెలిపారు.
గ్రామకంఠం భూమికి బదులుగా ఆలయ ఆవరణం స్థలాన్ని వదలాలని రోడ్డుపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న తూప్రాన్ డిఎస్పి నరేందర్ గౌడ్ సంఘటన స్థలానికి చేరి ఆందోళనకారులను సముదాయించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు