హైదరాబాద్, 23 సెప్టెంబర్ (హి.స.) తెలంగాణలోని ప్రధాన నది ప్రాజెక్టులైన శ్రీరాంసాగర్, నిజాంసాగర్, నాగార్జునసాగర్, సింగూరులకు భారీగా వరద వస్తోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా ఈ ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారాయి. నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద పోటెత్తింది. దీంతో అధికారులు 40 వరద గేట్లను ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులోకి లక్షా 46 వేల క్యూసెక్కుల నీరు వస్తుండగా, రెండు లక్షల 55 వేల క్యూసెక్కుల నీరు బయటకు వెళ్తాంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా, ప్రస్తుతం 1089 అడుగులకు చేరింది. మొత్తం నీటి సామర్థ్యం 80 టీఎంసీలు ఉండగా, ఇప్పుడు 75 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
ఇక కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టుకు కూడా వరద కొనసాగుతోంది. ప్రాజెక్టులోని 10 గేట్లను ఎత్తివేసి నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్రా 70,787 క్యూసెక్కులు, ఔట్లో 78,446 క్యూసెక్కులుగా నమోదైంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1405 అడుగులు కాగా, ప్రస్తుతం 1403 అడుగుల వద్ద నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు పూర్తి నీటి సామర్థ్యం 17 టీఎంసీలు ఉండగా, ఇప్పుడు 15 టీఎంసీల నీరు ఉంది.
న
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..