హైదరాబాద్, 23 సెప్టెంబర్ (హి.స.)
కోకాపేట నియో పోలీస్ వద్ద దారి దోపిడీ జరిగింది. ఓ ప్రేమ జంటపై ఆరుగురు దుండగులు దాడి చేశారు. అనంతరం వారిని తీవ్ర భయభ్రాంతులకు గురిచేసి వారి వద్ద ఉన్న బంగారు గొలుసు ఫోన్లు అపహరించుకుపోయినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ దారి దోపిడీ ఘటన సోమవారం రాత్రి జరిగింది. భయాందోళనకు గురైన ప్రేమ జంట కొద్దిసేపటి తర్వాత చేరుకొని నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఇన్స్పెక్టర్ హరికృష్ణ రెడ్డి ఆదేశాలతో కేసును ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను అతి త్వరలోనే పట్టుకుంటామని, కేసుకు సంబంధించిన వివరాలు మంగళవారం సాయంత్రం మీడియాకు తెలియజేస్తామని ఇన్స్పెక్టర్ హరికృష్ణ రెడ్డి తెలియజేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు