కోదాడలో గంజాయి కలకలం..
తెలంగాణ, సూర్యాపేట. 23 సెప్టెంబర్ (హి.స.) సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని హుజూర్ నగర్ రోడ్ బైపాస్ రోడ్డులోని భారత్ పెట్రోల్ బంక్ పక్కన గుర్తు తెలియని నిందితులు క్వింటన్నర గంజాయి మంగళవారం తెల్లవారు జామున పడేసి వెళ్లిన సంఘటన కలకలం రేపుతుంది. కోదా
గంజాయి


తెలంగాణ, సూర్యాపేట. 23 సెప్టెంబర్ (హి.స.)

సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని హుజూర్ నగర్ రోడ్ బైపాస్ రోడ్డులోని భారత్ పెట్రోల్ బంక్ పక్కన గుర్తు తెలియని నిందితులు క్వింటన్నర గంజాయి మంగళవారం తెల్లవారు జామున పడేసి వెళ్లిన సంఘటన కలకలం రేపుతుంది. కోదాడ పట్టణ సీఐ శివశంకర్ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని విచారించారు. గంజాయి రవాణా చేసినా, విక్రయించినా, వినియోగించినా బాధ్యుల పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

స్థానికుల వివరాల ప్రకారం.. మంగళవారం ఉదయం 6 గంటల సమయంలో క్వింటన్నర గంజాయిని కోదాడ మీదుగా ప్లాస్టిక్ బస్తాల్లో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తరలించే ప్రయత్నం చేశారు. కోదాడలో పోలీసుల తనిఖీలు ముమ్మరంగా జరుగుతున్నాయని తెలుసుకున్న ఆ వ్యక్తులు భయంతో పట్టణంలోని హుజూర్ నగర్ బైపాస్ రోడ్డు సమీపంలోని ఓ పెట్రోల్ బంక్ సమీపంలోని మామిడికాయల గోదాంలో పారేసి పరారయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆ మార్గంలోని సీసీ కెమెరాల సాయంతో నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande