మెదక్, 23 సెప్టెంబర్ (హి.స.) ఏడుపాయల వనదుర్గ భవాని
సన్నిధానంలో దేవి శరన్నవరాత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు మంగళవారం గాయత్రీ దేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని తరించారు. ఉత్సవాలలో మూడో రోజు బుధవారం వనదుర్గామాత అన్నపూర్ణ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు