తిరుమల, 23 సెప్టెంబర్ (హి.స.)
, ఈ నెల 24 నుంచి జరగనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలకు దేశవిదేశాల నుంచి భక్తులు తరలివస్తారు. వీరు అవస్థలు పడకుండా తిరుమల చేరుకుని తితిదే సౌకర్యాలను సద్వినియోగం చేసుకుంటే.. వాహన సేవలు, శ్రీవారి దర్శనాన్ని సులభంగా, శీఘ్రంగా చేసుకోవచ్చు.
యాత్రికుల వసతి సముదాయం-1(పీఏసీ), పీఏసీ-2, పీఏసీ-3, పద్మనాభ నిలయంలో భక్తులకు లాకర్ల సదుపాయం, వసతి, కల్యాణకట్ట, భోజన వసతి అందుబాటులో ఉంటాయి. ఈనెల 25న సీఎం చంద్రబాబు ప్రారంభించిన అనంతరం పీఏసీ-5 అందుబాటులో రానుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ