హైదరాబాద్, 23 సెప్టెంబర్ (హి.స.)రైల్వే స్టేషన్ ఆవరణలో ఎంపిక చేయబడిన వ్యక్తులు ధరించిన జాకెట్ల వెనుక భాగంలో ముద్రించబడిన క్యూ.ఆర్ కోడ్ ను 'యూ.టి.ఎస్ ' యాప్ తో స్కాన్ చేయడం ద్వారా జనరల్ టిక్కెట్లను కొనుగోలుచేసే ఏర్పాటు
దక్షిణ మధ్య రైల్వే ప్రయాణీకులకు సౌకర్యాలు కల్పించడానికి మరియు రిజర్వ్ చేయని టిక్కెట్లను సౌకర్యవంతంగా కొనుగోలు చేయడానికి, 'యూ.టి.ఎస్ ' మొబైల్ అప్లికేషన్‌ను ప్రవేశపెట్టింది. దీని ప్రారంభం నుండి, ఈ యాప్‌కు రైలు వినియోగదారుల నుండి విశేషమైన సానుకూల స్పందన వస్తోంది మరియు ఈ యాప్‌ను ఉపయోగించే ప్రయాణికుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఆధునిక టికెటింగ్ వ్యవస్థలో యూ.టి.ఎస్ యాప్ ఒక పెద్ద ముందడుగు మరియు భారతీయ రైల్వేలలో భారీ సంఖ్యలో ప్రయాణించే అన్‌రిజర్వ్డ్ ప్రయాణికులకు ఒక వరంగా మారింది. యూ.టి.ఎస్ మొబైల్ యాప్ ద్వారా అన్‌రిజర్వ్డ్ టిక్కెట్ల అమ్మకాన్ని ప్రోత్సహించడానికి, మొబైల్ యాప్ గురించి రైలు వినియోగదారులకు మరింత చేరువ చేయడానికి జోన్ అనేక చర్యలు తీసుకుంటోంది.
ఈ దిశలో భాగంగా , రాబోయే పండుగ సీజన్‌లో రద్దీ పెరిగే అవకాశం ఉన్నందున, స్టేషన్ ప్రాంతాలలో యూ.టి.ఎస్ మొబైల్ యాప్ ద్వారా టిక్కెట్ల కొనుగోలును ప్రోత్సహించడానికి దక్షిణ మధ్య రైల్వే ఒక నూతన చొరవను ప్రవేశపెట్టింది. దీని ప్రకారం రెట్రో రిఫ్లెక్టివ్ జాకెట్లు వెనుక వైపున క్యూ.ఆర్ కోడ్ ముద్రించబడినది. యూ.టి.ఎస్ యాప్ లేదా రైల్ వన్ యాప్ ద్వారా ఈ క్యూ.ఆర్ కోడ్ ను స్కాన్ చేయడం ద్వారా జనరల్ టిక్కెట్లను కొనుగోలుచేసే సౌకర్యం ఏర్పాటుచేయబడింది. స్టేషన్ కాన్కోర్స్ ప్రాంతంలో యూ.టి.ఎస్ మొబైల్ యాప్ని ప్రోత్సహించడానికి నియమించబడిన వ్యక్తులు ఈ జాకెట్లను ధరిస్తారు. రైలు వినియోగదారులు యూ.టి.ఎస్ లేదా రైల్ వన్ యొక్క మొబైల్ అప్లికేషన్‌తో జాకెట్ వెనుక భాగంలో ఉన్న క్యూ. ఆర్ కోడ్‌ను స్కాన్ చేయవచ్చు. యూ. టి. ఎస్ యాప్ ద్వారా అప్లికేషన్ వినియోగం మరియు టిక్కెట్లను కొనుగోలు చేయడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి సిబ్బంది వారికి మార్గనిర్దేశం చేస్తారు. ఈ ముఖాముఖీ విధానం యాప్ యొక్క వినియోగదారు-స్నేహపూర్వక లక్షణాల గురించి, ముఖ్యంగా క్యూ.ఆర్ కోడ్ ఆధారిత టికెటింగ్ గురించి ప్రయాణీకులలో అవగాహన కల్పించడంలో సహాయపడుతుంది. ఇది టికెట్ కౌంటర్ల వద్ద క్యూలను తగ్గించడానికి మరియు నగదు రహిత, డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడానికి సహాయపడుతుంది.
ఈ సౌకర్యం జోన్‌లోని ఆరు డివిజన్‌లలోని ప్రధాన స్టేషన్లైన సికింద్రాబాద్, కాచిగూడ, విజయవాడ, గుంటూరు, గుంతకల్లు , తిరుపతి, నాందేడ్ మొదలైన వాటిలో ప్రవేశపెట్టబడింది. జనరల్ టిక్కెట్ల కొనుగోలు కోసం మొదట విధించిన దూర పరిమితులను సడలించారు మరియు రైలు వినియోగదారులు ఇప్పుడు స్టేషన్ ప్రాంగణం మరియు రైల్వే ట్రాక్ నుండి 5 మీటర్ల దూరంలో ఉన్న ఏ ప్రదేశం నుండైనా టిక్కెట్లను కొనుగోలు చేయవచ్చు. సరళంగా చెప్పాలంటే, ప్రయాణీకుడు తమ ఇంటి నుండే తమ టిక్కెట్లను (జర్నీ/ప్లాట్‌ఫామ్ టిక్కెట్లు రెండూ) బుక్ చేసుకోవచ్చు మరియు అన్‌రిజర్వ్డ్ టిక్కెట్లను కొనుగోలు చేయడానికి పొడవైన క్యూలలో నిలబడకుండా రైలులో ప్రయాణంచేసే సౌకర్యం. స్టేషన్ కాన్కోర్స్ ప్రాంతంలో ఉన్న ప్రయాణీకులు ఈ క్యూ. ఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా టిక్కెట్లను కొనుగోలు చేయవచ్చు.
యూ.టి.ఎస్ యాప్ బహుళ భాషాలలో అందుబాటులో ఉండి ప్రయాణీకులు బుకింగ్ కౌంటర్ల వద్ద పొడవైన క్యూలలో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా వారి సౌలభ్యం ప్రకారం వారి మొబైల్ ద్వారా రిజర్వ్ చేయని జర్నీ టిక్కెట్లు, ప్లాట్‌ఫామ్ మరియు సీజన్ టిక్కెట్లను కొనుగోలు చేయడానికి వీలు కల్పిస్తుంది. డిజిటల్ ఇండియా చొరవకు అనుగుణంగా, ఈ యాప్ పేపర్‌లెస్ (నగదు రహిత ) లావాదేవీలను కూడా అనుమతిస్తుంది మరియు ప్రయాణీకులు ఆర్-వాలెట్, పే-టిఎం, యూ.పి.ఐ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటి వివిధ డిజిటల్ మోడ్‌ల ద్వారా చెల్లింపు చేయవచ్చు. ఆర్-వాలెట్ ద్వారా టిక్కెట్లు కొనుగోలు చేసినప్పుడు 3శాతం బోనస్ కూడా క్రెడిట్ చేయబడుతుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు