ఏపీకి పొంచి ఉన్న తుపాను ముప్పు.. నాలుగు రోజులు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
అమరావతి, 23 సెప్టెంబర్ (హి.స.)ఏపీకి తుపాను ముప్పు పొంచి ఉంది. ప్రస్తుతం ఈశాన్య బంళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుండగా.. ఈనెల 25వ తేదీ గురువారం రోజున మరో అల్పపీడనం ఏర్పడనున్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలో పిడుగు
Rain


అమరావతి, 23 సెప్టెంబర్ (హి.స.)ఏపీకి తుపాను ముప్పు పొంచి ఉంది. ప్రస్తుతం ఈశాన్య బంళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుండగా.. ఈనెల 25వ తేదీ గురువారం రోజున మరో అల్పపీడనం ఏర్పడనున్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

నేడు అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది.

గురువారం ఏర్పడే అల్పపీడనం శుక్రవారానికి వాయుగుండంగా బలపడి.. క్రమంగా తుపానుగా రూపాంతరం చెందే అవకాశం ఉందని, ఇది 27వ తేదీన దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా మధ్య తీరందాటే అవకాశం ఉందని APSDMA వివరించింది. దీనిప్రభావంతో 24వ తేదీ నుంచి 27వ తేదీ వరకూ నాలుగురోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande