ముంబయి,23, సెప్టెంబర్(హి.స.)దేశీయ మార్కెట్లు మంగళవారం స్వల్ప నష్టాల్లో మొదలయ్యాయి (Stock Market Today). అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాలు ఉన్నప్పటికీ.. మన సూచీలు నష్టాల్లోనే కదలాడుతున్నాయి. ఉదయం 9.31 సమయంలో సెన్సెక్స్ 79.79 పాయింట్లు నష్టపోయి 82,077 వద్ద ఉండగా.. నిఫ్టీ 31.8 పాయింట్లు క్షీణించి 25,170 వద్ద ట్రేడవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 13 పైసలు తగ్గి, 88.41గా ఉంది.
నిఫ్టీ సూచీలో మారుతీ సుజుకీ, టాటా మోటార్స్, హీరో మోటోకార్ప్, బజాజ్ ఫిన్‌సర్వ్, టాటాస్టీల్ షేర్లు లాభాల్లో ఉండగా.. టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్, ఆసియన్ పెయింట్స్, ట్రెంట్, అపోలో హాస్పిటల్స్, కొటక్ మహీంద్రా స్టాక్స్ నష్టాల్లో ఉన్నాయి. అమెరికా హెచ్-1బీ కొత్త వీసాకు లక్ష డాలర్ల రుసుము విధించడంతో నిన్న నష్టాల్లో ముగిసిన సూచీలు.. నేడూ అదే బాటలో పయనిస్తున్నాయి. జీఎస్టీ రేట్ల తగ్గింపు సానుకూలత కంటే అమెరికా ప్రభుత్వ నిర్ణయంపైనే మదుపర్లు ఎక్కువగా దృష్టిసారిస్తున్నారు
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ