కర్నూలు , 23 సెప్టెంబర్ (హి.స.)చివరకు కర్నూలు జిల్లా ఆలూరు టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి మార్పు జరిగింది. పార్టీ ఇన్‌ఛార్జి అంశంలో గత నాలుగు నెలలుగా నెలకొన్న వివాదానికి పార్టీ అధిష్ఠానం తెరదించింది. నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా ఇప్పటి వరకు కొనసాగిన వీరభద్రగౌడ్‌ను తప్పించి, ఆయన స్థానంలో వైకుంఠం జ్యోతిని పార్టీ నియమించింది.
పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఆ పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి, మాజీ ఎంపీపీ వైకుంఠం ప్రసాద్ అర్ధాంగి జ్యోతి కొత్తగా ఇన్‌ఛార్జి బాధ్యతలు చేపట్టనున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి