అమరావతి, 24 సెప్టెంబర్ (హి.స.)
విజయవాడలోని ఇంద్రకీలాద్రి పర్వతంపై వెలసిన శ్రీ కనకదుర్గమ్మ ఆలయం భక్తుల ప్రతీకగా నిలుస్తోంది. తాజాగా ఈ పవిత్ర ఆలయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజు దర్శించుకున్నారు. అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయనకు ఆలయ అధికారులు సంప్రదాయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. దర్శనం అనంతరం వేద పండితులు ఆశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు రఘురామ కృష్ణంరాజుకు లడ్డు ప్రసాదం, అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ