తిరుపతి 24 సెప్టెంబర్ (హి.స.):ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నేడు మూడు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ మేరకు అధికారులకు ఆయన పర్యటన షెడ్యూల్‌ను విడుదల చేశారు. పశ్చిమ గోదావరి, కృష్ణా, తిరుపతి జిల్లాల్లో సీఎం పర్యటించనున్నట్లు తెలిపారు. పాలకొల్లులో మంత్రి నిమ్మల కుమార్తె వివాహ కార్యక్రమానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించనున్నారు. అనంతరం విజయవాడలో ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్‌కు స్వాగతం పలికి ఆయనతో సమావేశం కానున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇవాళ(బుధవారం) శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ప్రారంభకానున్న సందర్భంగా శ్రీవారి8,/కి పట్టు7 వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించనున్నారు. తర్వాత శ్రీవారి ప్రసాదాల కోసం ఏర్పాటు చేసిన మిషన్ ప్లాంట్‌ను సీఎం ప్రారంభిస్తారు.7475
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ