ప్రకాశం, 24 సెప్టెంబర్ (హి.స.): జిల్లా మరోసారి భూ ప్రకంపనలతో ఉలిక్కిపడింది.. ఒంగోలులో అర్ధరాత్రి సమయంలో స్వల్పంగా కంపించింది భూమి.. రాత్రి 2 గంటల సమయంలో 2 సెకన్ల పాటు భూమి కంపించినట్టు చెబుతున్నారు.. ఒంగోలులోని సీఎస్ఆర్ శర్మ కాలేజీ ప్రాంతంలో రాత్రి 2 గంటల ప్రాంతంలో భూమి కనిపించినట్లు చెబుతున్నారు స్థానికులు.. అయితే, రాత్రి సమయం కావటంతో స్థానికులు గుర్తించేలోపే భూ ప్రకంపనల తీవ్రత తగ్గినట్టుగా తెలుస్తోంది.. దీనిపై సమాచారం అందుకున్న అధికారులు.. స్థానికుల నుంచి పూర్తిస్థాయిలో సమాచారం సేకరిస్తున్నారు.. కాగా, ప్రకాశం జిల్లాలో గతంలోనూ భూ ప్రకంపనలు చోటు చేసుకున్న విషయం విదితమే.. ఈ ఏడాది మే నెలలో ఓసారి.. గత ఏడాది డిసెంబర్‌లోనూ ఓసారి ప్రకాశం జిల్లా ప్రజలను భూ ప్రకంపనలు భయాందోళనకు గురిచేశాయి.. అయితే, తాజాగా సంభవించిన భూప్రకంపనలపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది..
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ