అమరావతి, 24 సెప్టెంబర్ (హి.స.)
: వైసీపీ లీడర్లు… కేడర్ తో వరుస సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్న ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి మరో కీలక సమావేశానికి సిద్ధమయ్యారు.. తాడేపల్లి వైసీపీ సెంట్రల్ ఆఫీస్ కేంద్రంగా ఎమ్మెల్సీలు మినహా అందరితో కలసి ఓ జంబో మీటింగ్ అరేంజ్ చేశారు జగన్.. ఓ వైపు అసెంబ్లీ సమావేశాలు.. మెడికల్ కళాశాలల ప్రవేటీకరణపై వైసీపీ ఆందోళనల నడుమ ముఖ్య నేతలందరితో జగన్ ఏర్పాటు చేసిన కీలక సమావేశం పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తికరంగా మారింది.
గత సార్వత్రిక ఎన్నికల్లో పరాజయం తర్వాత పార్టీ గేరు మార్చారు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్.. ఫలితాలు వచ్చిన తొలి నెల నుంచే పార్టీ కేడర్ తో పాటు లీడర్లతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు.. కార్యకర్తల నుంచి కీలక నేతలతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు.. ఈ క్రమంలో తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత వైఎస్ జగన్ అధ్యక్షతన ఈ సమీక్షా సమావేశం జరగనుంది.. సమావేశానికి వైసీపీ రీజినల్ కో-ఆర్డినేటర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పీఏసీ మెంబర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు హాజరుకానున్నారు.. ఇప్పటికే వరుసగా సమావేశాలు.. మరోవైపు జిల్లా పర్యటనలతో పార్టీ కేడర్‌లో ఉత్సాహాన్ని నింపుతూ వస్తున్న వైఎస్ జగన్.. ఇంకా వైపు ప్రభుత్వ వైఫల్యాలపై ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు కూడా ఉధృతం చేశారు.. మీకు అండగా నేను ఉంటానంటూ జగన్ 2.0ను పరిచయం చేశారు జగన్..
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ