పులివెందల, 24 సెప్టెంబర్ (హి.స.)రాష్ట్రంలో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. వివేకా హత్య కేసులో తన పరువుకు భంగం కలిగించారంటూ పులివెందున సీఐ శంకరయ్య ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబకు లీగల్ నోటీసులు పంపాడు.
ఆ నోటీసులలో వివేకా హత్య కేసులో తన వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగించేలా చంద్రబాబు పలుమార్లు తప్పుడు ప్రకటనలు చేశారని ఆరోపించారు. దీంతో ఆయన తరఫు న్యాయవాది జి.ధరణేశ్వర రెడ్డి నుంచి ఈనెల 18న సీఎం చంద్రబాబుకు లీగల్ నోటీసులు అందిన విషయం ఆలస్యంగా ఈ రోజు వెలుగులోకి వచ్చింది. అయితే, వివేకా హత్య కేసులో తనపై చేసిన నిరాధార ఆరోపణలకు గాను అసెంబ్లీలో సీఎం చంద్రబాబు తనకు తనకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని, పరువు ప్రతిష్టలకు భంగం కలిగించినందకు గాను రూ.1.45 కోట్ల పరిహారం చెల్లించాలని శంకరయ్య లీగల్‌లో నోటీసులు ప్రస్తావించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి