హెచ్‌1బీ వీసా ఫీజుల వేళ.. భారత నిపుణులకు జర్మనీ పిలుపు
దిల్లీ: 24 సెప్టెంబర్ (హి.స.)హెచ్‌1బీ వీసా (H-1B visa) ఫీజును అమెరికా ప్రభుత్వం లక్ష డాలర్లకు పెంచడం పెను సంచలనమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పలు దేశాలు భారతీయ నిపుణులను ఆకర్షించే పనిలో పడ్డాయి. అందులోభాగంగా నైపుణ్యం కలిగిన భారతీయుల (Indians) ను తమ ద
జర్మనీ పిలుపు


దిల్లీ: 24 సెప్టెంబర్ (హి.స.)హెచ్‌1బీ వీసా (H-1B visa) ఫీజును అమెరికా ప్రభుత్వం లక్ష డాలర్లకు పెంచడం పెను సంచలనమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పలు దేశాలు భారతీయ నిపుణులను ఆకర్షించే పనిలో పడ్డాయి. అందులోభాగంగా నైపుణ్యం కలిగిన భారతీయుల (Indians) ను తమ దేశంలోకి ఆహ్వానిస్తూ భారత్‌లోని జర్మనీ (Germany) రాయబారి ఫిలిప్ అకెర్‌మన్‌ పోస్టు పెట్టారు.

‘అత్యంత నైపుణ్యం కలిగిన భారతీయులందరికీ ఇది మా ఆహ్వానం. జర్మనీ దాని స్థిరమైన వలస విధానాలను కలిగిఉంది. దీంతో పాటు ఐటీ, సైన్స్‌, సాంకేతిక రంగాల్లో భారతీయులకు మంచి ఉద్యోగావకాశాలు కల్పిస్తుంది. మా దేశంలో పనిచేసే భారతీయులు జర్మన్‌ల కంటే ఎక్కువగా సంపాదిస్తున్నారు. అధిక వేతనాలతో వారు జర్మనీ సంక్షేమానికి ఉపయోగపడుతున్నారు. మేము హార్డ్‌వర్క్‌, ఉత్తమమైన వ్యక్తులకు మంచి ఉద్యోగం ఇవ్వడం అనేదాన్ని నమ్ముతాం’ అని ఫిలిప్ పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande