విజయవాడ, 24 సెప్టెంబర్ (హి.స.)విజయవాడ (Vijayawada)లోని ఇంద్రకీలాద్రి (Indrakiladri)పై దసరా శరన్నవరాత్రోత్సవాలు మూడో రోజు అట్టహాసంగా కొనసాగుతన్నాయి. ఇవాళ అమ్మవారు అన్నపూర్ణ దేవిగా భక్తలకు దర్శనం ఇవ్వనున్నారు.
గాయత్రీ దేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజామున 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు భక్తుల రద్దీ కొనసాగింది. నిన్న ఒక్కరోజు అమ్మవారిని లక్ష మంది భక్తులు దర్శించుకున్నారు.
ఇక ప్రసాద విక్రయాలు, టిక్కెట్ల అమ్మకాలతో రెండో రోజు సాయంత్రం 5 గంటలకే ఆలయానికి రూ.25.48 లక్షల ఆదాయం సమకూరినట్లుగా ఆలయ అధికారులు వెల్లడించారు. రూ.300 టిక్కెట్లపై రూ.8.99 లక్షలు, రూ.100 టిక్కెట్లపై రూ.3.16 లక్షలు, లడ్డూ ప్రసాద విక్రయాలపై రూ.11.53 లక్షల ఆదాయం వచ్చినట్లుగా ఈవో వీకే శీనానాయక్ పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి