రాష్ట్రంలో.16 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశాము /మంత్రి నారా.లోకేష్
అమరావతి, 4 సెప్టెంబర్ (హి.స.) రాష్ట్రంలో 16 వేల పైచిలుకు ఉపాధ్యాయ పోస్టులను విజయవంతంగా భర్తీ చేశామని మంత్రి నారా లోకేశ్‌ తెలిపారు. జగన్‌ ఒక్క డీఎస్సీని కూడా నిర్వహించలేదని విమర్శించారు. క్యాబినెట్‌ భేటీకి ముందు మంత్రులతో నారా లోకేశ్‌ సమావేశమయ్యారు.
రాష్ట్రంలో.16 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశాము /మంత్రి నారా.లోకేష్


అమరావతి, 4 సెప్టెంబర్ (హి.స.)

రాష్ట్రంలో 16 వేల పైచిలుకు ఉపాధ్యాయ పోస్టులను విజయవంతంగా భర్తీ చేశామని మంత్రి నారా లోకేశ్‌ తెలిపారు. జగన్‌ ఒక్క డీఎస్సీని కూడా నిర్వహించలేదని విమర్శించారు. క్యాబినెట్‌ భేటీకి ముందు మంత్రులతో నారా లోకేశ్‌ సమావేశమయ్యారు. డీఎస్సీ అభ్యర్థులతో అభినందన సభ పెడితే బాగుంటుందని లోకేశ్‌కు మంత్రులు సూచించారు.

గతేడాది ఇదే సమయంలో తలెత్తిన బుడమేరు వరదపై లోకేశ్‌ చర్చించారు. జగన్‌ ఐదేళ్ల నిర్వాకంతో బుడమేరు కట్ట తెగి సమస్యలు ఎదుర్కొన్నామన్నారు. గత అనుభవాలతో ఈసారి అప్రమత్తంగా ఉన్నట్లు తెలిపారు. అన్ని శాఖల సమన్వయంతో సవాళ్లు దీటుగా ఎదుర్కొన్నామని వివరించారు. ఇన్‌ఛార్జి మంత్రులు నియోజకవర్గాల్లో కార్యకర్తల్ని కలవాలని కోరారు. వారి సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్‌లు నిర్వహించాలని సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande