అమరావతి, 4 సెప్టెంబర్ (హి.స.)
ఏపీ మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. యూనివర్సల్ హెల్త్ పాలసీ కి కేబినెట్ ఆమోదముద్ర వేసింది. రాష్ట్రంలోని ప్రజలందరికీ ఆరోగ్య బీమా కల్పిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఆయుష్మాన్ భారత్-ఎన్టీఆర్ వైద్యసేవా పథకం కింద యూనివర్సల్ హెల్త్ పాలసీకి మంత్రివర్గం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీని ద్వారా ఒక్కో కుటుంబానికి ఏడాదికి రూ.25లక్షల వరకూ ఉచిత చికిత్సలు అందేలా కొత్త విధానానికి ఆమోదముద్ర వేసింది. ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా అందరికీ హెల్త్ పాలసీ అమలయ్యేలా నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 1.63 కోట్ల కుటుంబాలకు ఆరోగ్య బీమా అందేలా ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ