హైదరాబాద్, 4 సెప్టెంబర్ (హి.స.) కేసీఆర్, కేటీఆర్ వల్లే బీఆర్ఎస్
నుంచి నేతలు బయటకు వచ్చారని బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. తాను కూడా వారి వల్లే బీఆర్ఎస్ ను వీడాను తప్ప... కవిత చెప్పినట్లు హరీశ్ రావు వల్ల కాదన్నారు. తాజాగా ఓ న్యూస్ చానల్ తో మాట్లాడిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి.. కేసీఆర్, కేటీఆర్ అహంకారం, అవినీతి వల్లే నేను బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చానన్నారు. కవిత ఇప్పుడు అమాయకురాలిలా మాట్లాడుతున్నారని కవిత అవినీతి చేయలేదా అని ఆయన ప్రశ్నించారు. ఒకటే ఫ్యామిలీ ఈ రాష్ట్రాన్ని రూల్ చేసిందని కాళేశ్వరం అవినీతి మొత్తం కేసీఆర్ దేనన్నారు. హరీశ్ రావు కేవలం సంతకాలకే పరిమితం అయ్యారని వ్యాఖ్యలు చేశారు. కవితను బీజేపీ వైపు కూడా చూడనివ్వం అన్నారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..