కరీంనగర్, 4 సెప్టెంబర్ (హి.స.)
గ్రానైట్ వ్యాపారులను ఉద్దేశించి
కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంకెన్నాళ్లు బీఆర్ఎస్ కు దోచిపెడతారు? సమాజానికి పనికొచ్చే సేవ చేయరా? అని నిలదీశారు. నాపై నిందలేసినా ఖండించరా? చైనాతో సంబంధాలు మెరుగుపర్చినా మోదీకి థ్యాంక్స్ చెప్పరా? అని ప్రశ్నించారు. కరీంనగర్లో రేపు గణేశ్ నిమజ్జన ఉత్సవాల నేపథ్యంలో ఇవాళ బండి సంజయ్ మానకొండూరు చెరువును సందర్శించి నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా గ్రానైట్ వ్యాపారులతో బండి సంజయ్ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. భయపడుతూ ఎన్నాళ్లు వ్యాపారం చేస్తారు? స్వేచ్చగా వ్యాపారం చేసే పరిస్థితిని నేను కల్పిస్తాను సమాజానికి సేవ చేయండని చెప్పారు. బండి సంజయ్ వ్యాఖ్యలతో ఖంగుతిన్న గ్రానైట్ అసోసియేషన్ నాయకులు.. మోడీ చైనా పర్యటనతో మా వ్యాపార సంబంధాలు మెరుగవుతాయని చెప్పారు. సమాజానికి సేవ చేస్తామన్నారు. అధికారులకు సహకరించాలని గ్రానైట్ వ్యాపారులకు సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు