బిగ్ దివాలి గిఫ్ట్.. కొత్త జీఎస్టీ రేట్లపై హర్ష్ గోయెంకా హర్షం..
హైదరాబాద్, 4 సెప్టెంబర్ (హి.స.) సామాన్య, మధ్య తరగతి ప్రజలకు ఊరట కల్పిస్తూ జీఎస్టీలో కీలక సంస్కరణలు చేపట్టిన ప్రభుత్వ నిర్ణయంపై పలువురు రాజకీయ, వ్యాపార వేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బిగ్ దివాళీ గిఫ్ట్ అంటూ సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను
హర్షి గోయింగ్క


హైదరాబాద్, 4 సెప్టెంబర్ (హి.స.)

సామాన్య, మధ్య తరగతి ప్రజలకు ఊరట కల్పిస్తూ జీఎస్టీలో కీలక సంస్కరణలు చేపట్టిన ప్రభుత్వ నిర్ణయంపై పలువురు రాజకీయ, వ్యాపార వేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బిగ్ దివాళీ గిఫ్ట్ అంటూ సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని మోదీ ప్రకటించిన దీపావళి కానుక అద్భుతంగా ఉందంటూ దిగ్గజ పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా కితాబిస్తున్నారు.

‘ప్రతి భారతీయుడికి ఇది అతిపెద్ద దీపావళి కానుక. రోజూవారీ నిత్యావసరాలు, వైద్యం, విద్య, వ్యవసాయ పరికరాలపై జీఎస్టీ తగ్గించారు. ఇప్పుడు కిరాణ సామగ్రి చౌక ధరకే లభిస్తుంది. ఆరోగ్య సంరక్షణ ఖర్చు తగ్గుతుంది. విద్య అందుబాటు ధరలో ఉంటుంది. రైతులకు మద్దతు దొరుకుతుంది. మొత్తంగా తదుపరి జీఎస్టీ=జీవన సౌలభ్యం+ఆర్థిక వ్యవస్థకు ఊతం' అని హర్ష్ గోయెంకా ఎక్స్లో పోస్టులో రాసుకొచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande