కామారెడ్డి, 4 సెప్టెంబర్ (హి.స.)
భారీ వర్షాలు, వరదల కారణంగా
తీవ్రంగా దెబ్బతిన్న కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి నియోజకవర్గంలో జరిగిన పంట నష్టాన్ని అంచనా వేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఏరియల్ సర్వే నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ ప్రత్యేక ఆహ్వానం మేరకు సీఎం, మంత్రులతో కలిసి నియోజకవర్గానికి చేరుకున్నారు. హెలికాప్టర్ ద్వారా ఎల్లారెడ్డికి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి, ముందుగా ఏరియల్ సర్వే చేశారు. ఈ సందర్భంగా వరదలతో దెబ్బతిన్న పంట పొలాలు, రోడ్లు, వంతెనలు, ముఖ్యమైన పోచారం ప్రాజెక్టును పరిశీలించారు. ఏరియల్ సర్వే సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ పంట పొలాలకు జరిగిన నష్టాన్ని, దెబ్బతిన్న పోచారం ప్రాజెక్టు పరిస్థితిని సీఎం రేవంత్ రెడ్డికి మంత్రులకు అయన వివరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు