కామారెడ్డి, 4 సెప్టెంబర్ (హి.స.)
సీఎం రేవంత్ రెడ్డి నేడు కామారెడ్డి జిల్లా వరద బాధిత ప్రాంతాలలో పర్యటించారు. తాడ్వాయి మండలం ఎర్రపహాడ్ చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. లింగంపేటలో వరదలకు దెబ్బతిన్న లింగంపల్లి ఆర్&బి బ్రిడ్జిని సీఎం పరిశీలించారు. వరదల సమయంలో బ్రిడ్జి పరిస్థితిపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను సందర్శించారు. పూర్తిస్థాయి అంచనాలతో బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. విభాగాల వారీగా వరద నష్టంపై పూర్తి వివరాలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం సీఎం రేవంత్రెడ్డి మీడియాతో మాట్లాడారు.వందేళ్లలో ఎప్పుడూ రానంత వరద వచ్చింది. ప్రభుత్వం మిమ్మల్ని కచ్చితంగా ఆదుకుంటుంది. ఎల్లారెడ్డి నియోజకవర్గం ఎమ్మెల్యే మదన్ మోహన్ మీకు అండగా నిలిచి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా చూశారన్నారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు