రికార్డు ధర 51,07,777 పలికిన మై హోమ్ భూజా గణపతి లడ్డూ.. ఇది బాలాపూర్ లడ్డు కన్నా ఎక్కువ..
హైదరాబాద్, 4 సెప్టెంబర్ (హి.స.) మాదాపూర్ మై హోమ్ భుజాలో లడ్డు వేలం పాట రికార్డు ధర పలికింది. చాలా సేపటి వరకు లడ్డూ వేలంపాట హోరా హోరీగా సాగింది. ఈ వేలం పాటలో రూ. 51,07,777లకు లడ్డూను గణేష్ రియల్ ఎస్టేట్ సంస్థ అధినేత ఇల్లందు గణేష్ సొంతం చేసుకున్నారు.
గణపతి లడ్డు


హైదరాబాద్, 4 సెప్టెంబర్ (హి.స.)

మాదాపూర్ మై హోమ్ భుజాలో లడ్డు వేలం పాట రికార్డు ధర పలికింది. చాలా సేపటి వరకు లడ్డూ వేలంపాట హోరా హోరీగా సాగింది. ఈ వేలం పాటలో రూ. 51,07,777లకు లడ్డూను గణేష్ రియల్ ఎస్టేట్ సంస్థ అధినేత ఇల్లందు గణేష్ సొంతం చేసుకున్నారు. గత సంవత్సరం ఇక్కడ లడ్డు వేలం పాట రూ.29 లక్షలకు పాడారు.

గతేడాది కూడా లడ్డూను గణేష్ ఏ దక్కించుకున్నారు. ఈ ఏడాది కూడా ఆయనే దక్కించుకోవడం విశేషం. గణేష్ రియల్ ఎస్టేట్ సంస్థ అధినేత, ఖమ్మం జిల్లా ఇల్లందు గ్రామ వాసి గణేష్, సరిత దంపతులు ఈ లడ్డూను దక్కించుకున్నారు. ఇదిలా ఉంటే గతేడాది బాలాపూర్ లడ్డూ ముప్పై లక్షల ఒక వెయ్యి రూపాయలకు వేలం పాడగా ఇప్పుడు మై హోమ్ భుజా లడ్డూ వేలంలో దానిని దాటేసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande